సీబీఐ జేడీ తీరుపై విచారణ జరుపండి

నా బిడ్డను కాపాడండి
ప్రధానికి వైఎస్‌ విజయమ్మ వేడుకోలు
న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి):
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య క్షుడు, ఎంపీ జగన్‌మో మన్‌రెడ్డిపై సిబిఐ కక్షసాధింపు చర్య లను ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజ యమ్మ తెలిపారు.బుధవారం నాడు ఆమె నేతృత్వంలో వైఎస్సార్‌సిపి నేతలు ప్రధాని తో సమావేశ మయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు తగిన భద్రత కల్పించాలని ప్రధా నిని కోరినట్లు ఆమె తెలిపారు. సిబిఐ వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరినట్లు చెప్పారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వ్యవహార శైలి పై కూడా విచారణ జరిపించాలని కోరినట్టు ్ల తెలిపారు.తాము చెప్పిన అన్ని విషయాలను ప్రధాని సావధానంగా విన్నారని, సానుకూల చర్య లు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని విజయమ్మ తెలిపారు. సిబిఐ ఒక్క జగన్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ కొడుకుగా పుట్టడమే జగన్‌ చేసిన నేరమా? అని అడిగారు. ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్‌ కుటుం బం అంటే సిబిఐకి ఎందుకింత కక్ష అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ, సంగ్మా ఇద్దరూ తమ మద్దతు కోరినట్లు తెలిపారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుం టామని విజయమ్మ చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని తక్షణమేఆదుకోవాలనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కోరినట్టు విజయ్మ తెలిపారు. తాము ప్రస్తావించిన రూతు సమ్యలపై ప్రధాని సానుకూ లంగా స్పందించారని ఆమె అన్నారు. , రైతుల సమస్యలపై చర్చించడానికే తాము ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతాంగ సమస్య లను ప్రధానికి వివరించామన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సరిగా అందడంలేదన్నారు. మరోవైపు విద్యుత్‌ సరఫరా సరిగాలేక రైతన్న విలవిలలాడిపోతున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతు న్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. విజయమ్మ వెంట సీనియర్‌ నేత డాక్టర్‌ ్‌ఎంవి మైసూరా రెడ్డి, ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు.