సీమాంద్ర, తెలంగాణ నేతలతో చంద్రబాబు మూడు గంటల పాటు చర్చలు

హైదరాబాద్‌: తెలంగాణపై తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ రేపు సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం పార్టీలోని సామాంద్ర, తెలంగాణ నేతలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణపై కేంద్రానికి మరో మారు స్పష్టత ఇచ్చే అంశం ఏ రూపంలో ఉండాలనే దానిపైనే చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారని కేంద్రానికి మరో మారు లేఖ ఇస్తారని ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, ఈ సమయంలో వెనక్కి పోవడం సరికాదని తెలంగాణ నేతలు బాబు వద్ద అన్నట్లు సమాచారం. అయితే ఈ వాదనతో సీమాంద్ర నేతలు విబేదించినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకు తెరాస, కాంగ్రెస్‌ కలిసి కుట్ర పన్నుతున్నాయని దాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుందామని చంద్రబాబుతో అన్నట్లు సమాచారం.