సీమాంధ్ర నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి స్పష్టత ఇచ్చే అంశంపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, కోడెల, సోమిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.