సీ బ్లాక్‌ వద్దకు దూసుకు వచ్చిన జాగృతి కార్యకర్తలు

హైదరాబాద్‌: విజయవాడలో రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆరుగురు కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సమతా భవనం వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం పలువురు సచివాలయం సీ బ్లాక్‌కు వద్దకు దూసుకువచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.