సుప్రీంలో మోడికి చుక్కెదురు

ప్రార్ధనాలయాల పరిహారంపై స్టేకు సుప్రీం నో
సెక్యూలర్‌ విలువలను కాపాడాలని హితవు
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి):
గోద్రా అనంతర అలర్లలో దెబ్బతిన్న ఆలయాలకు పరిహరం చెల్లించాలన్న గుజరాత్‌ హైరోక్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు నరేంద్రమోడీ సర్కారు అభ్యర్థనను తోసి పుచ్చింది. ఆ సమయంలో ఎన్నిప్రార్ధనా యాలు దెబ్బతిన్నయి.?, పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలు తెలపాలని జస్టిస్‌ కేఎన్‌ రాదాకృష్ణన్‌, జస్టిస్‌ దీపక్‌ మిశ్రాల ధర్మాసనం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివరాలు తెలుసుకునేందుకు ఏమైనా అధ్యయనం నిర్వహించారా? అని కూడా అత్యున్నత న్యాయస్ధానం మోడీ సర్కారును ప్రశ్నించింది. కేసుతదుపరి విచారణను ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది. అంతకు మందు గుజరాత్‌ ప్రభుత్వ న్యాయవాదుల వాదిస్తూ హైకోర్టు ఆదేశాలు సమ్మతంగా లేవని రాజ్యంగా లౌకిక నిబంధనలు ప్రకారం ఏ ప్రభుత్వమూ మత పరమైన సంస్థలకు నిధులు ఇవ్వదని పేర్కొన్నారు. ఐదువందలకు పైగా ప్రార్థన నాలయాలకు పరిహరం ఇవ్వాలని ఫిబ్రవరి 8న గుజరాత్‌ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. ఇస్లామిక్‌ రిలీఫ్‌ కమిటీ అనే ఎన్‌జీవో పిటిషన్‌ పై హైకోర్టు ఈమేరకు స్పందించింది.