సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్

న్యూఢిల్లీ : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండును క్వాష్ చేయాలని పిటిషన్ లో చంద్రబాబు కోరారు. సోమవారం ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించిన విషయం విదితమే.

తాజావార్తలు