సుమన్‌ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజిరావు రెండో కుమారుడుడైన సుమన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య ఆయన అభిమానులు సుమన్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. రామోజీ ఫీల్మ్‌ సిటీలోని రామోజీ స్వగృహం నుంచి బయలు దేరిన శవయాత్ర ఫిల్స్‌సిటీలోనే ఏర్పాటు చేసిన స్మశాసవాటిక వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున సుమన్‌ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చితిపై ఉంచిన సుమన్‌ పార్దీవదేహానికి ఆయన ఏకైక కుమారుడు నిప్పంటించారు. ఈ అంతిమయాత్రలో రామోజీరావు మిత్రులు, సన్నిహితులు,ప్రముఖ సినీనటులు, రాజకీయ నాయకులు, వేల సంఖ్యలో సుమన్‌ అభిమానులు పాల్గొన్నారు