సురాజ్యంతోనే అసలైన ప్రయోజనం: జేపీ
హైదరాబాద్: నిరుపేదలకు మంచిపాలన లేనప్పుడు పావలా వడ్డీ రుణాలు, రూపాయికి కిలో బియ్యం వంటి పథకాలు స్వల్పకాలికంగా మేలు చేసినా.. దీర్ఘకాలికంగా దేశాభివృద్ధికి సురాజ్యం వల్లనే అసలైన ప్రయోజనం చేకూరుతుందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. మియాపూర్ మదీనగూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం 2012లో దేశంలో సురాజ్య సాధనం లక్ష్యంగా ఓ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జేపీ మాట్లాడుతూ అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్, తెదేపా పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయి ఆరోపించారు. దామాషా పద్ధతిలో పార్టీ పరంగా ఓ ఓటు, వ్యక్తిగతంగా మరో ఓటు వేసే అవకాశం రావాలన్నారు.