సూరారం లో కంటి వెలుగు ప్రారంభం

 ప్రారంభించిన సర్పంచ్ పోలబోయిన అండాలు నర్సింహా  *

రామన్నపేట మార్చి 6 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన  రెండో విడత  కంటి వెలుగు కార్యక్రమం  మండలంలోని సూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరంను  సర్పంచ్ పోలబోయిన అండాలు నర్సింహా, ఎంపిటిసి దోమల సతీష్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  పంచాయతీ సెక్రటరీ అర్. వేణు , వార్డ్ మెంబర్లు,  నాగమ్మ, నర్సింహా, కృష్ణా రెడ్డి, మల్లేశం, గ్రామ ప్రజలు మునిపంపుల వైద్య అధికారి డాక్టర్. అశ్విని కుమార్,క్యాంప్ వైద్య అధికారి డాక్టర్. చందశ్విని, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.