సూరి హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నీల శ్రీనివాసరావు, పెనకొండ నర్సింహరావులను సీఐడాపోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టులో గుత్తేదారులను బెదిరించి డబ్బు వసూలుచేసి భాను ఖాతాలోకి వీరు మళ్లించినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వీరిని గురువారం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.