సూర్యాపేట బస్టాండ్‌ని పరిశీలించిన ఎస్పీ దుగ్గల్

నల్గొండ, (ఏప్రిల్ 3): జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దుగ్గల్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ ఆవరణలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద బుధవారం అర్థరాత్రి కొంతమంది దుండుగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హోంగార్డు మహేశ్, కానిస్టేబుల్ లింగయ్య అక్కడికక్కడే చని పోగా, సీఐ మొగిలయ్య, హోంగార్డు కిషోర్లు తీవ్ర గాయాల పాలయ్యారు.వీరిని హైదరాబాద్ కి  తరలించి శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. సూర్యాపేట బస్టాండ్ లో ఆగంతుకులు పోలీసులపై కాల్పులు జరపడం, ఇద్దరు పోలీసులు మరణించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఘటనకు జిల్లా ఎస్పీ ప్రభాకరరావుని బాధ్యుడిని చేసి అతడిని హైదరాబాద్ సీఐడీకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ కొత్త ఎస్పీగా నియమించింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే  దుగ్గల్  సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.