సెల్‌ఫోన్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

గుంటూరు: కొత్తపేటలోని సెల్‌ఫోన్‌ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.