సొంతూరికి ప్రణబ్‌

కోల్‌కతా:యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ సొంతూరికి వెళ్తున్నారు.రెండురోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్‌ చేరుకున్న ప్రణబ్‌కి ఘన స్వాగతం లభించింది,ఈ రోజు బీర్‌భమ్‌ జిల్లాలోని తన సొంత గ్రామమైన మిరాటి వెళ్తారు.అక్కడ తన పూర్వీకుల ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.పక్కనే మరో గ్రామంలో ఉన్న సోదరి అన్నపూర్ణ బెనర్జీని కలిసి ఆమె ఆశీస్సులు కూడా ప్రణబ్‌ పొందనున్నారు.రామకృష్ణమఠం హెడ్‌ క్వాక్టర్‌ అయిన బేలూరు మఠాన్ని కూడా ప్రణబ్‌ ఈ పర్యటనలో సందర్శిచనున్నారు.వీటన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి మద్దతు కోరతారా అన్నది అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం