సోంపేట కాల్పులు ఘటన కేసు వాయిదా

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకేసును హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాల్పులు కేసు విచారణ నివేదికను నాలుగు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి మెజిస్ట్రేట్‌ విచారణ పూర్తియిందని అడ్డకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలియజేశారు.