సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఫాసిహ్‌ మహమూద్‌

న్యూఢిల్లీ:ఉగ్రవాదులతో సంబందాలున్నాయని అనుమానిస్తున్న బీహర్‌ ఇంజినీర్‌ పాసిహ్‌ మహమూద్‌ సౌదీ అరేబియా అధికారుల నిర్బందంలో ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.ఆయన్ను వెనక్కి రప్పించడం క్లిష్టపమైన సుదీర్ఘమైన ప్రక్రియ అని న్యాయమూర్తి జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది.తన భర్తను భారత అధికారులే నిర్భందంలోకి తీసుకున్నారని,ఆయన ఆచూకి వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫాసిహ్‌ భార్య నిఖత్‌ పర్వీన్‌ సుప్రీంకోక్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.