స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ: జానారెడ్డి

హైదరాబాద్‌: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించినట్లు సీనియర్‌ మంత్రి జానారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్యా స్థానిక సంస్థలకు నిధులు అపవద్దని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన  తెలియజేశారు. తెలంగాణా కవాతుపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఆయనతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయం చెబుతానన్నారు.