స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనపాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.