స్వచ్ఛభారత్‌, స్వచ్ఛతెలంగాణ నినాదంతో ముందుకెళ్లాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ తెలంగాణ నినాదంతో స్వచ్ఛభారత్‌ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ా’య్రర్మన్లు, ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి మున్సిపాల్టీలకు కేటాయిస్తామని తెలిపారు. మార్కెట్లు, పార్కులు, డంపింగ్‌ యార్డులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పట్టణాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. రోజూ 135 లీటర్ల మంచి నీటిని ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. నగరాలు, పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాలికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.