స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన ర్యాలీ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 17. (జనం సాక్షి). స్వచ్ఛ సర్వేక్షన్ 2023 స్వచ్ఛ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నీరజ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు. దేశంలోనే స్వచ్ఛతలో తెలంగాణ రాష్ట్రం ముందుండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా అందరం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ స్వచ్ఛత కోసం కృషి చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పూర్ణచందర్, మెప్మా టిఎంసి రాజమణి, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ సుకుమార్ ,వార్డ్ ఆఫీసర్ శేఖర్, ఆర్ పి లు మహిళా సమైక్య సంఘాల సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.