స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదనంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రదర్శనలు కనువిందు చేశాయి. కవాతు (సాయుధ విభాగం) లో కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ ప్రథమ బహుమతిని పొందింది. కవాతు ప్రదర్శనలో సాఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రదర్శనలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులకు ప్రత్యేకబహుమతి లభించడం విశేషం. కవాతులో బహుమతి రావడం గురుకుల విద్యాలయాల చరిత్రలో ఇదే ప్రథమం. 2008, 2009, 2010, 2011 సంవత్సరాల్లో రాష్ట్రపతి ప్రకటించిన పోలీసు పతకాలను పోలీసు అధికారులు, సిబ్బంది పాటు పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నాగార్జునసాగర్‌ బీసీ గురుకుల పాఠశాల, కరీంనగర్‌ జిల్లా తుంగూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు సీఎం బహుమతులు అందజేశారు.