స్వామిగౌడ్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్‌: టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు పదవి విరమణ చేసిన సంధర్భాంగా పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం  రవీంద్రభారతిలో ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు నాగం జనార్దాన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె.కేశవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీఎన్‌జీవోస్‌ పాత్ర అమోగమని కొనియాడారు. చంద్రబాబు ఎన్ని దోంగవేశాలు వేసిన ప్రజలు నమ్మటం లేదని అన్నారు. దేవి ప్రసాద్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులైజ్‌ చేయాలని, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని అన్నారు.