స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఉత్తర తెలంగాణ టీచర్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే పరిగణిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన బీజేపీ సీనియర్‌ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పాలమూరు, పరకాలలో మాదిరిగానే ఉత్తర తెలంగాణ టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి కూడా  బీజేపీ పోటీ చేస్తుందని ఆయన తెలియజేశారు. స్వామిగౌడ్‌ను ప్రకటించేటపుడు కేసీఆర్‌ జేఏసీని సంప్రదించలేదని ఆయన అన్నారు.