హజ్‌యాత్రకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం: అహ్మదుల్లా

హైదరాబాద్‌: అక్టోబరు 6 నుంచి 19 వరకు హైదరాబాద్‌నుంచి హజ్‌ యాత్రకు వెళ్లెవారి కోసం 26 ప్రత్యేక విమానాలు నడిపేలా చర్యలు తీసుకున్నామని వైనార్టీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లా చెప్పారు. హజ్‌ యాత్రకు వెళ్లె యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించేందుకు హజ్‌ కమిటీ నేడు హైదరాబాదులో సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అహ్మదుల్లా హజ్‌యాత్రకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికతో వ్వవహరించేలా పోలీసు ఎయిర్‌పోర్టు, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌ హజ్‌ హౌస్‌లో సమస్యలను పరిష్కరిస్తున్నామని వచ్చే ఏడాదికి ఎయిర్‌పోర్టు సమీపంలో కొత్త హజ్‌ హౌస్‌ సిద్ధమవుతుందని మంత్రి చెప్పారు.