హత్య కేసులో ఇద్దరు అరెస్టు
విజయవాడ, జూలై 21: కంచికచర్లలో శుక్రవారం జరిగిన హోటల్ కార్మికుని హత్య కేసులో ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అక్షయ హోటల్‌లో కార్మికులు గొడవపడి పరస్పరం మరణాయుధాలతో తలపడగా మల్లేశ్ అనే కార్మికుడు మృతి చెందాడు. సంఘటన జరిగిన వెంటనే నిందితులు పరారయ్యారు. అయితే పోలీసులు తీవ్రంగా గాలించి ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు దొరకాల్సి ఉందని పోలీసులు తెలిపారు.