హనుమాన్ స్వాముల మహాపాదయాత్ర
జుక్కల్, మార్చి 24, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని కేం రాజ్ కల్లాలి నుండి మిర్జాపూర్ హనుమాన్ మందిరం వరకు సర్పంచ్ రమేశ్ దేశాయ్ (కేంరాజ్ కల్లాలి సర్పంచ్) అధ్వర్యంలో సుమారు 25కిలోమీటర్లు హనుమాన్ స్వాములు మహాపాదయాత్ర చేశారు. హన్మాన్ స్వాములు, భక్తులు సుమారు రెండువేల మంది భుజాన కాషాయ జెండాలు ధరించి బాజాభజంత్రీలతో భగవన్నామ స్మరణచేస్తూ మిర్జాపూర్ హన్మాన్ మందిరం చేరుకున్నారు.మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం మందిరంలో
సర్పంచ్ రమేశ్ దేశాయ్ ఆద్వర్యంలో హన్మాన్ స్వాములకు, భక్తులకు బిక్ష (అన్న ప్రసాదం) కార్యక్రమం నిర్వహించారు.