హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం 25మంది మృతి

హర్యానా: హర్యానాలోని బివాని జిల్లా శివాని వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఘఘామారి ఆలయం నుంచి హర్యానాలోని కెయితాల్‌ జిల్లాఓ కాలయట్‌కు భక్తులతో వెళ్తున్న మినీట్రక్‌ శివాని వద్ద బోల్తాపడింది. ఘటనా స్థలంలో 22మంది మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృతి చెందారు.