హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూత

చెన్నై: ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్ను మూశారు. స్వగృహంలో ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1947 ఆగస్టు 7న సుత్తివేల జన్మించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. ఈ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 250కి పైగా చిత్రాలలో నటించిన  సుత్తివేలు తొలి చిత్రం ముద్దమందారం. నాలుగుస్తంభాల ఆట సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. జంద్వాల సినిమాల ద్వారా ఆయన హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందేమాతరం సినిమాకు ఆయనకు అవార్డు లభించింది.