హిందూ రక్ష సమితి ధర్నా

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్‌ ఓవైసీని అరెస్టు చేయాలని ఇందిరా పార్క్‌ వద్ద హిందూ రక్ష సమితి ధర్నా చేస్తోంది. ధర్నాలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గోన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద భారీగా మద్దతుదారులు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.