హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 20 మంది మృతి

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం అషపురి  జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కంగాడ జిల్లా పాలంపూర్‌ నుంచి అషపురి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఘటనాస్థలనికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.