హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

share on facebook

మాజీ ఎంపి రాజయ్య మండిపాటు
వరంగల్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతోందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హుజురాబాద్‌లో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల కమిషన్‌ పటించుకోవడం లేదని విమర్శించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికని రద్దు చేసి ఎన్నికల కమిషన్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. హుజురాబాద్‌లో జరగుతున్న సంఘటనలకు సీఎం కేసీఆర్‌, మోదీ బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు. అత్యంత విలువైన ఓటు అమ్మబడుతూ.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని రాజయ్య అన్నారు. అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి విూద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రులు వరి కొనుగులులపైనా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు రైతులతో ఆటలాడుతున్నాయని విమర్శలు గుప్పించారు.

Other News

Comments are closed.