హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. సాగర్‌లో కాలుష్యం తగ్గించేందుకు బెంగళూరు తరహా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహాల తయారీలో సహజ రంగులు వాడాలని సూచించింది. విగ్రహాల ఎత్తు తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. సాగర్‌లో ప్రత్యేక ఎన్‌క్లోజర్స్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జులై 4కు కోర్టు వాయిదా వేసింది.