హుస్సేన్‌సాగర్‌ నాలాకు ఇరువైపుల అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌: గనరంలోని హుస్సేన్‌సాగర్‌ నాలకు ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ బందోబస్తు మధ్య చేపట్టారు.బాగ్‌లింగంపల్లి నాలా నల్లకుంట గాంధీనగర్‌ బస్తీ వరకు ఉన్న మెకానిక్‌ షెడ్‌లు, నివాస గృహాలను కూల్చివేశారు. సుమారు 40కి పైగా నిర్మాణాలు కూల్చివేయడంతో స్థానికులు ఆందోళనకు దిగాకు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై నిరసన వ్యక్తం చేశారు.