హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: హెచ్‌సీయూలో కిడ్నాప్‌ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపకులపతి కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. నిన్న అర్థరాత్రి యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి వస్తున్న ఎంటెక్‌ విద్యార్థిని మౌనిసీరాంను కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. అయితే ఆమె కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న విద్యార్థులు,, ముగ్గురు యువకులను చితకబాది పోలీసులకు అప్పగించారు. వీరిని రామకృష్ణ, కోటేశ్వరరావు, నాగేందర్‌లుగా గుర్తించారు. చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.