హెడ్మాస్టర్ ఇంట్లో పేలిన నాటు బాంబు

గుంటూరు:జిల్లాలోని బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో రిటైర్డు హెడ్మాస్టర్‌ ఇంట్లో నాటుబాంబులు పేలాయి. ఈ నేపథ్యంలో సాయుధ పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు గ్రామంలో ఇంటింటిని తనిఖీలు చేస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలు చెందారు.