హెలికాప్టర్‌ కూలి నైజీరియా గవర్నర్‌ దుర్మరణం

అబుజా: నైజీరియాలోని కదునా గవర్నర్‌ పాట్రిక్‌ యకోవా, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఆండ్రూ ఆజాజీ శనివారం హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మృతి చెందారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు కూడా దుర్మరణం పాలయ్యారు. వీరంతా నౌకాదళానికి చెందిన హెలికాప్టర్‌లో పోర్ట్‌ హార్ట్‌కోర్టు నుంచి రాష్ట్రపతి అనుయాయుడి తండ్రి అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్టొనడానికి బయేల్సా వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది.