హైకోర్టును అడ్డుపెట్టుకుని తెలంగాణను ఏలాలని.. ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారు: కవిత
లోక్‌సభలో హైకోర్టు అంశంపై చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. హైకోర్టు విభజన అంశానివకి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉన్నదని, కేంద్రం సహకరించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు రాజకీయ అంశమని, దీనిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తెలంగాణను ఏలాలని భావిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కుల్ని కాపాడాలని కోరారు