హైకోర్టు సిజెకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): రాజ్‌ భవన్‌లో తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డిలు చీఫ్‌ జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులతో పాటు మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ శ్రీమతి వాణిదేవి ఉన్నారు. అంతకుముందు రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ నూతన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి గవర్నర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు.