హైదరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

హైదరాబాద్‌: నగరంలోకి ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అంబర్‌పేటలోని గంగానగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రద్దీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది.