హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు

హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. మంగళవారం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని ఉప్పల్, ఎల్బీ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.వారం రోజుల క్రితం హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని పలు ప్రాంతాలు, నగర శివారులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.