హైదరాబాద్‌ టెస్టులో భారత్‌ విజయం

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరగుతున్న మొదటి టెస్టులో టీ ఇండియా ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫాల్‌ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ 46/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు బరిలోకి దిగింది. భారత్‌ బౌలర్ల దెబ్బకు కేవలం 164 పరుగులకే టేలర్‌ సేన కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లలో విలియమమ్‌సన్‌ 52, మెక్‌కల్లమ్‌ 42, పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెస్‌ ఎవరూ పెద్దగా రాణించలేదు. రెండో ఇన్సింగ్స్‌లో భారత్‌ బౌలర్‌ రవిచంద్ర అశ్విన్‌ ఆరు వికెట్లు తీయగా, మరో బౌలర్‌ ఓజాకు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో భారత్‌ 1-0 తేడాతో ముందంజలో ఉంది.