హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారిపై స్థంభించిన రాకపొకలు

జహీరాబాద్‌రూరల్‌:జహీరాబాద్‌ మండలం హుగ్గెళ్లి గ్రామ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహరదారిపై గల కల్వర్టును హైదరాబాద్‌వైపు వెళుతున్న లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.లారీ డ్రైవర్‌లు తీవ్రంగా గాయపడటంతో వారిని జహీరాబాద్‌ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.ప్రమాదంతో హైదరాబాద్‌-ముంబయి మార్గంలో రాకపోకలు స్థంభించాయి.దీంతో జహీరాబాద్‌ రూరల్‌ ఎన్‌ఐ నరేందర్‌ అక్కడకు చేరుకుని క్రేస్‌ తెప్పించి లారీ తప్పించి రాకపొకలు పునరుద్దరించారు.