హైదరాబాద్-విజయవాడ మార్గంలో భారీగా నిలిచిన వాహనాలు
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్ -విజయవాడ మార్డంలో ఆర్టీసీ బస్సులు, వ్రైవేటు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఈ మార్గంలో వివిధ టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ నకిరేకల్, విజయవాడ గట్టుభీమవరం టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.