హైద్రాబాద్‌లో హైఅలర్ట్

gr1m4q2fహైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భద్రతా బలగాలు భద్రతను పటిష్టం చేశాయి.  ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయానికి వచ్చి పోయే వాహనాలను సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. భాగ్యనగరంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రద్దీ కూడళ్లలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. గురుదాస్ పూర్‌లో ఉగ్రవాదుల దాడిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఖండించారు.మీకు మామిడి పళ్లు, ప్రజలకు తుపాకీ గుళ్లు: పొన్నం గురుదాస్ పూర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఖండించారు. ప్రధాని మోడీకి మామిడి పళ్లు పంపిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్‌లోని ప్రజల మీదకు ఉగ్రవాదులను పంపాడని మండిపడ్డారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ప్రధానులు ప్రజలను హత్య చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని పాలించేందుకు 56 అంగుళాల ఛాతి కలిగిన వ్యక్తి కావాలని చెప్పిన మోడీ, ఆ ఛాతితో ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలన్నారు. సాక్షాత్తూ అధికార భాగస్వామిగా ఉన్న బిజెపి, జమ్మూ కాశ్మీర్లో యథేచ్చగా పాకిస్తాన్, ఐసిస్ జెండాలు ఎగురుతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు యాకూబ్ మెమెన్ ఉరి అంసాన్ని బీహార్ ఎన్నికల్లో వాడుకుందామని మోడీ చూస్తున్నారన్నారు.