హోంమంత్రితో ముగిసిన టీఆర్‌ఎస్‌ భేటీ

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. అరెస్టులు ఆపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని ఎమ్మెల్యేలు తెలియజేశారు. మార్చ్‌ను విఫలం చేసేందుకే పోలీసులు కుట్ర పన్నారని ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. పోలీసులు అరెస్టులు ఆపకపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని హెచ్చరించారు.