హౌరా వెళ్లాల్సిన 6 రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: తునిలో వరదల కారణంగా హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లాల్సిన 6 రైళ్లను దారి మళ్లించారు. కాజీపేట, బల్లార్షా, నాగపూర్‌ మీదుగా రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. హౌరా వెళ్లాల్సిన ఈస్ట్‌కోన్‌ ఎక్‌ప్రెస్‌ సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. మరోవైపు తుని రైల్వేస్టేషల్లో అర్థరాత్రి నుంచి ఫలక్‌నుమా  ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు.