అంకిత భావంతో పనిచేసినప్పుడే – అదుపులో శాంతి భద్రతలు
ఏలూరు, జూలై 16 : పోలీసులు అంకిత భావంతో పనిచేసినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని జిల్లా ఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి సోమవారం నాడు ఇక్కడ అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం అన్నది ఉపాధికోసమే నన్న భావన విడనాడాలని కోరారు. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో అన్న కనీస స్పృహను అలవరుచుకుంటేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని అన్నారు. అప్పుడే పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు. చట్ట బద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖలో ఇటీవల కొత్తగా ఎంపికైన 33 మంది హోంగార్డులకు ఏలూరులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.