అంగడి వాడి బడిబాట కార్యక్రమం పల్లె ప్రగతి
పెద్దవంగర జూన్ 07(జనం సాక్షి )పల్లె ప్రగతి ప్రోగ్రామ్ ద్వారా గ్రామాలలో జరుగుతున్న పనులను చూచి ప్రజలు ఆనందం వ్యకo చేస్తున్నారని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు.
మంగళవారం షెడ్యూల్లో భాగంగా చిట్యాల గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఎంపీపీస్ ,పాఠశాలలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి శ్రమధానం చేయడం జరిగిందని తెలిపారు.తరువాత ఎంపీపీ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పాత ఇండ్ల గోడలు వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.గ్రామంలో కలియ తిరుగుతూ ప్రతి బజారులో ఉన్న సమస్యలను గుర్తించరూ. త్వరలో పాఠశాలలు ప్రారంభo అవుతునందున మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ స్కూల్స్ లను జీపి సిబ్బంది మరియు ఇతర వర్కర్లను ఏర్పాటు చేసుకొని పాఠశాల ఆవరణo, తరగతి గదులను,టాయిలెట్స్ శుభ్రం చేసి ఉంచాలని ఎంపీడీఓ కు చూచించారు.స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత పాఠశాలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, శ్రమాధానం చేసిన తరువాత మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి .వేణుగోపాల్ రెడ్డి,జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆర్ రాజు, టీ ఏ యాకయ్య,పాఠశాల ఎహ్ లు ఎం,వెంకన్న,కే నరేష్,తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు కొల్లూరి రమేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లపు పరమేష్,గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు దేశెట్టి మహేష్,రాపోలు సుదర్శన్,ఆవుల కొమురల్లి,మాజీ గౌడ సంఘం అధ్యక్షులు కే .యాకయ్య,మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఆవుల సోమన్న,ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు,సి ఏ,లు,వి ఆర్ ఏ లు తదితరులు పాల్గొన్నారు