అంగన్వాడి టీచర్ అమ్మ లాగా పిల్లలకు సేవలు అందించాలి.
వికారాబాద్ జిల్లా పాలనాధికారి నిఖిల
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 1
అంగన్వాడీ టీచర్లు అమ్మలాగా పిల్లలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల హితవు పలికారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సిడిపిఓలు , సూపర్వైజర్లు , అంగన్వాడి టీచర్లతో అంగన్వాడీల పనితీరుపైన కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు ఎప్పటికప్పుడు ఆకలి పరీక్షలు నిర్వహిస్తూ వారి యొక్క పెరుగుదలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పిల్లల పట్ల నామమాత్రంగా కాకుండా వ్యక్తిగత భాద్యత తీసుకొని వారి బాగోగులు చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడి టీచర్లు ప్రతిరోజు గ్రామంలో తిరిగి ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ అంగన్వాడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పిల్లల్లో రక్తహీనత లోపం వల్ల కూడా ఎదుగుదలతో పాటు బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. అంగన్వాడీ టీచర్లు సకాలంలో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బాధ్యత కూడా తీసుకొని డాక్టర్ల సూచన మేరకు మందులు అందించాలని తెలిపారు. తల్లిపాలతో పాటు అంగన్వాడీలలో అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకు బాలామృతం నెలకు రెండుసార్లు అందించి తక్కువ తీవ్ర లోప పోషణకు కావలసిన పోషకాహారాన్ని అందిస్తూ సాధారణ బరువు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లల విషయంలో గ్రామస్థాయిలో అంగన్వాడి కమిటీలు తల్లిదండ్రులను, గ్రామస్తులను, పంచాయతీ కార్యదర్శులను, ప్రజా ప్రతినిధులను సమావేశపరిచి పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకోవాలని సూచించారు. గర్భం దాల్చిన నాటి నుండి అంగన్వాడి కేంద్రాలలో ఇస్తున్న పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పెరుగుదల సరిగా లేని పిల్లలు 16 వారాల్లోపు పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేలా దృష్టి సారించాలని తెలిపారు.
జిల్లాలో బాల్య వివాహ విషయంలో ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ 176 వివాహాలు జరిగాయని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించి వృత్తిపరంగా బాల్య వివాహాలను నివారించేందుకు తమ వంతు బాధ్యత కూడా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పలాన్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వెంకటేశం, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail