అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలి * ఐఎఫ్టియు నాయకులు షేక్ యాకుబ్ షావలి

టేకులపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి ): గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్ల సమ్మె శిబిరానికి సోమవారం ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయ వెంకన్నలు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా అంగన్వాడి సెంటర్లు సమ్మె వలన మూతపడ్డాయని పిల్లలకు పౌష్టిక ఆహారం అందడం లేదని,వచ్చిన చదువు కూడా పిల్లలు మరచిపోతున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. అంగన్వాడి, మినీ అంగన్వాడి, టీచర్లు ఆయాలు కనీస వేతనం కోసం న్యాయం పరంగా, శాంతియుతంగా సమ్మె చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు పిలిపించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక భద్రత పిఎఫ్ ఎస్ ఐ గ్రాట్యూటీ, బతకలేక మని అడుగుతుంటే చనిపోయినంక ఇస్తాము, ఇన్సూరెన్స్ కల్పిస్తాం, వయసు పెంచుతాం అనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని అంగన్వాడి నాయకత్వాన్ని చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అంగన్వాడీలు మీరు ఒంటరిగా లేరని, మీ వెనక తెలంగాణ సమాజం అండగా ఉండదన్నారు.సమ్మె సమస్యలు పరిష్కారమయ్యేదాకా సమ్మెను ఐక్యంగా కొనసాగించాలని అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు ఐ ఎఫ్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదన్నారు.మీ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.