అంగన్వాడీ పిల్లలకు అక్షర అభ్యాసం.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలల్లో పంపిస్తుంటే విద్యార్థుల తలరాత మారనుంది మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.మంగళవారం రోజున మండలంలోని రాజురా గ్రామంలో అంగన్వాడీ టీచర్ సంధ్య రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నోటు బుక్స్ బ్యాగు కాఫీలు పెన్నులు పంపిణీ తోపాటు శ్రీ జగదాంబమాత గుడిలో నిర్వహించిన అంగన్వాడీ పిల్లకు అక్షరాభ్యాస కార్యక్రమంలో మంగళవారం రోజున ముఖ్య అతిథిగా జడ్పీటీసీ అనిల్ జాధవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ పాఠశాలల్లో క్రమం తప్పకుండా ప్రతి రోజు చిన్నారులను పంపిస్తే ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం లభించి వారి ఎదుగుదల భవిష్యత్తు మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి స్థానిక సర్పంచ్ వసంత్ అంగన్వాడీ టీచర్ సంధ్య జీపీ సెక్రటరీ ఇస్పూర్ సర్పంచ్ రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.